calender_icon.png 3 April, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం

28-03-2025 12:00:00 AM

మఠంపల్లి, మార్చి 27:  కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిచిందని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా  ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలో ఆ సంఘం మండల కమిటీ  సమావేశానికి విచ్చేసిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో రెన్యువల్ లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని వారికి రెన్యువల్ చేయించే బాధ్యత ప్రభు త్వానిదేనని అన్నారు.

కార్మిక అడ్డాలలో ప్రభుత్వం షెడ్యూల్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని బయోమెట్రిక్ సిస్టం తో పాటు ఐరిస్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ సయ్యద్ రన్ మియా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి చల్లా జయకృష్ణ, జిల్లా నాయకులు జడ్డు సుజాత, బాలశౌ రెడ్డి, అమరారము వెంకటేశ్వర్లు, నకిరేకంటి అంజయ్య, ధనావత్ నెహ్రూ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.