పెద్దపల్లి, డిసెంబర్ 24: పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హల్‌లో మంగళవారం రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణు లకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ముందస్తు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేకు క్రిస్టియన్ సోదరులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని.
క్రిస్టియన్ సోద రుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న చర్చిల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, ఫాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరీమణులు, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.