calender_icon.png 30 January, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది

26-01-2025 07:34:31 PM

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మండలం లోని కోత్తుర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన 4 సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... ఇది రైతు ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామన్నారు. ఎవరూ కూడా తమకు రాలేదు అని ఇబ్బంది పడద్దన్నారు.పేద కుటుంబాలను ఆదుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అనంతరం 08 రేషన్ కార్డ్స్, 08 ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా 06 గురు లబ్ది దారులకు అందజేశారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ... మండలంలోని లబ్దిదారులందరికీ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, మండల అధ్యక్షులు పింగలి రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, చెల్ల నాగభూషణం, పూర్ణచేందర్ రావు, లబ్దిదారులు పాల్గొన్నారు.