19-04-2025 01:55:11 AM
కర్మన్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గంలోని రూరల్ మండలం దుర్షేడు, ముగ్దుంపూర్, జూబ్లీ నగర్, నగునూరు, గ్రామాలలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
దుర్షెడ్, ముగ్ధంపూర్ గ్రామాలకు చెందిన రైతులు, వారి వరి ధాన్యాన్ని అధికారులు స్థానిక మిల్లులకు కేటాయించకుండా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించారని, తద్వారా రవాణా భారం పెరుగుతుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి, సమస్యను వివరించగా వారు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన గోనె బాలరాజు అనే రైతు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సమృద్ధిగా నీళ్లు వచ్చాయని ఈ ప్రభుత్వంలో చుక్క సాగునీరు లేక పంట ఎండిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతును ఓదార్చిన ఎమ్మెల్యే గంగుల త్వరలోనే చలో నారాయణపూర్ పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై పోరాటం చేసి కరీంనగర్ నియోజకవర్గానికి సాగునీటికి కొదవ లేకుండా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
రాబోవు రోజుల్లో వడగలతో వర్షం పడే అవకాశం ఉన్నందున కల్లానికి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షెడ్ ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనె నరసయ్య, మాజీ సర్పంచులు జక్కం నరసయ్య,
దబ్బట రమణారెడ్డి, ఉప్పుల శ్రీధర్, రుద్ర రాము, మాజీ ఎంపీటీసీలు భోగ తిరుపతి, లింగారెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్,నాయకులు పాషా, భద్రయ్య, సాయిళ్ళ మహేందర్, ఎంపీడీవో సంజీవరావు, ఎంఏఓ బి. సత్యం, ఏఈఓ, నరసయ్య, పోచాలు, తదితరులు పాల్గొన్నారు.