calender_icon.png 3 April, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరుకొండ బాధితురాలి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

03-04-2025 12:15:10 AM

వనపర్తి టౌన్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళకు రక్షణ కరువైందని బి.ఆర్.ఎస్ మహిళా నాయకులు మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ అంజనేయ స్వామిని దర్శించుకొన్న మహిళపై దుండగులు అత్యాచారం చేయ డం దారుణమని అన్నారు.

పవిత్ర దేవాలయాల పరిసరాలలో మహిళపై దాడి జరగ డం అత్యంత దురదృష్టకరం అని ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధితు రాలికి న్యాయం చేయాలని ఆమెకు ఎక్సగ్రేసియ,ప్రభుత్వ ఉద్యోగం కల్పించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

గతములో దేవాలయములో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యో గి అనేక అక్రమాలకు పాల్పడడం అతనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు. రే వంత్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని రాజధాని నడిబొడ్డులో విదేశీ మహి ళపై అత్యాచారాము జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తక్షణమే బాధితురా లికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.