24-03-2025 12:08:23 AM
ప్రభుత్వం ముదిరాజులను అదుకోవాలి
తెలంగాణ ముదిరాజ్ మహాసభ లేఖ
హైదారబాద్, మార్చి 23 (విజయక్రాంతి): వెనకబడిన తరగుతుల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మే రకు లేఖ రాసింది. ఇటీవల తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన సమగ్ర కులగణనలో మొత్తం జనాభాలో ముదిరాజులే 13 నుంచి 14 శా తం ఉందని తేలిందని పేర్కొన్నారు. లేఖలో తమ డిమాండ్లకు సంబంధించి పలు అంశాలను ఏకరువు పెట్టారు. ‘ముదిరాజులైన మేము తెలంగాణలోనే అత్యంత వెనకబడి ఉన్నాం.
మత్స్యవృత్తి, తోటల పెంపకం ఇతర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాం. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న మాకు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట ఇచ్చిన హామీలు మాలో విశ్వాసాన్ని కలిగించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావొస్తున్న నేపథ్యంలో మాకిచ్చిన హామీలపై దృష్టి సారించండి. అభయహస్తంలో పేర్కొన్నవిధంగా ముదిరాజు/ తెనుగోళ్లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చండి. ముదిరాజ్ కోపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటుకు ధన్యావాదాలు.
ఈ సొసైటీకి కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన రూ.1,000 కోట్లు కేటాయించాలి. చెరువులు, కుంటలపై ముదిరాజు, బె స్త, గంగపుత్ర, గూండ్ల కులస్తులకే హక్కులు ఉండేలా జీవో జారీ చేయండి. మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయండి. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి, 75 శాతం సబ్సిడీతో సం క్షేమ పథకాలు చేపట్టాలి.
అభయహస్తంలో పేర్కొన్న ఈ అంశాలతో పాటు తెలంగాణ కోపరేటీవ్ ఫెడరేషన్‌కు వెంటనే ఎన్నికలు నిర్వహించిన చైర్మన్, పాలకమండలిని నియమించండి. వివిధ జిల్లాల్లో జరి గిన/ జరుగు తున్న మత్స్యపారిశ్రామిక సహకార సంఘా ల అడహాక్ కమిటీ ఎన్నికలు సంపూర్ణంగా పూర్తి చేయాలి. కోకాపేటలో చేపట్టిన నిర్మాణానికి ప్రభుత్వం తరఫున నిధులు మజూరు చేయాలి. 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలి. ముదిరాజ్ సామాజి క వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రివర్గంలో చోటుకల్పించలి. శాసనమండలిలో 3 స్థానా లు, రాజ్యసభలో ఒకస్థానం, కార్పొరేషన్ పదవుల్లో 10% కేటాయించాలి’ అన్నారు.