calender_icon.png 20 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి

05-04-2025 12:00:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా జేఏసీ నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత  ప్రభుత్వానిదే.. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులపై సవితి తల్లి ప్రేమనే కనబరుస్తున్నాయి..

ప్రతి రాజకీయ పార్టీ మా ఉద్యోగులను వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి తప్ప మా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనియెడల నిరసనలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జేఎసి కన్వీనర్, టీజీఓల జిల్లా సంఘం అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, కిరణ్ కుమార్, రామస్వామి, రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, శంకర్, శారద, సునీత,  తిరుపతి, గంప చంద్రశేఖర్, కరుణాకర్ రెడ్డి, మర్రి జయపాల్ రెడ్డి, వెలిచాల వెంకటస్వామి, ఎల్ కనకయ్య, జి శ్రీనివాస్, కుమార్, ప్రేమ్ సాగర్, హర్ ప్రీత్ కౌర్ పాల్గొన్నారు