22-03-2025 08:02:44 PM
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి..
కొల్చారం (విజయక్రాంతి): భారీ ఈదురు గాలులతో నష్టపోయిన చిరు వ్యాపారులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని ఏడుపాయల టీ జంక్షన్ వద్దా శుక్రవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో నష్టపోయిన చిరు వ్యాపార బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జీవనోపాధి కొరకు పంట పొలాల అమ్ముకొని చిరు వ్యాపారం చేసుకునే వారి దుకాణాలు ప్రకృతి వైపరీత్యంతో పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఇది చాలా బాధాకరం అన్నారు. ఈదురు గాలులతో నష్టపోయిన చిరు వ్యాపారులను తక్షణమే ప్రభుత్వ పరంగా ఆదుకొని వారికి ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.
అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలో వారికి లోన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలన్నారు. అలాగే విద్యుత్ అధికారులతో మాట్లాడి త్వరగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట తాసిల్దార్ గఫర్ మియా ఎంపీ ఓ కృష్ణవేణి బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, వేమారెడ్డి, కొమ్ముల యాద గౌడ్, సాయిని సిద్ధి రాములు, కరెంటు రాజా గౌడ్, నింగోల చెన్నయ్య, ఆరె రవీందర్, ఆంజనేయులు, పశుపతి, సాయిని రాజేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.