01-03-2025 12:00:00 AM
అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసీలను ప్రభుత్వాలు అడవులకు దూరం చేస్తున్నాయి. కొండ చీపుర్లు, ముష్టిగింజలు, చింత పండు, ఇప్పపువ్వు వంటి ఉత్పత్తులు సేకరించే అమాయక గిరిజనులపై అధికారులు అనవసరంగా జూలుం చలాయించడం బాగా లేదు. దీనికి తోడు ప్రతి ఏటా వేసవిలో తెలంగాణ ప్రాంతంలోని కోయ, గోండు, నాయక్ పోడు, చెంచు, కొలం మాన్నెవర్, ఆంధ్, బిల్, తోటి, పర్థన్ (తొమ్మిది) ఆదిమ తెగలకు ప్రధానంగా రెండవ పంటగా ఉపయోగపడే తునికాకు సేకరణపై ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి.
వారినీ ఆర్థికంగా అభివృద్ధికి దూరం చేయ డం అన్యాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ మైనింగ్ చె ప్పు చేతల్లో చేరి, ఆదివాసీలపైనే అటవీ విధ్వాంసకారులుగా ము ద్ర వేయడం దుర్మార్గం. తునికాకు సేకరణ కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రతి ఏటా వెనుకబడుతున్నది.
డిసెంబర్ నెలనుంచి మొదలు కావాల్సిన ప్రక్రియ మా ర్చి నెల వచ్చినా ప్రారంభింక పోతుండడంతో ఆదివాసీల్లో తీవ్ర నిరాసక్తత నెలకొంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసులకు చెల్లించాల్సిన తునికాకు బోనస్ డబ్బు పెండింగ్‌లోఉంది. సీఎం ఆదివాసులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
తాటి మధు