calender_icon.png 28 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిసెవాసులను ప్రభుత్వం ఆదుకోవాలి

28-04-2025 01:50:31 AM

సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 27: నిరుపేదలైన రావినారాయణరెడ్డి కాలనీ గుడిసె వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు.  కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధి రావి నారాయణరెడ్డి కాలనీలో మంటలు చెలరేగి కాలిపోయిన గుడిసెలను  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ సమితి నాయకులు పల్లా వెంకట్‌రెడ్డిలతో కలసి సందర్శించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. నిరుపేదలైన రావినారాయణరెడ్డి కాలనీ గుడిసె వాసులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అనుమానస్పదంగా అగ్నికి ఆహుతైన గుడిసెవాసులు కాలి బూడిద అయ్యాయి... కట్టుబట్టలు తప్ప మారేమి మిగలలేదని వారి పరిస్థితి హృదయ విదారంగా ఉందన్నారు. బాధితులను రేవంత్ సర్కార్ తాత్కాలికంగా రూ.1 లక్ష, నిత్యావసర సరుకులు అందజేసి.. వారికి శాశ్వతం పరిష్కారం దిశగా ఇంటి పట్టాలు ఇచ్చి.. 

ఇందిరమ్మ ఇంటినిర్మాణం పథకంలో భాగంగా ఇల్లు నిర్మించి ఆడుకోవాలని ప్రజల పక్షన విన్నవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆందోజు రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, సామిడి శేఖర్ రెడ్డి, పబ్బతి లక్ష్మణ్, అజ్మీర్ హరిసింగ్ నాయక్, కేతరాజు నర్సింహా, పొన్నాల యాదగిరి, తగిలి మధు, నవనీత, అరుణ, ప్రసాద్, వంశీ వర్ధన్, శ్రీదేవి, వెంకటేష్, సైదులు, సుజాత, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.