calender_icon.png 30 January, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏదుల డిండి ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

30-01-2025 01:14:34 AM

నాగర్ కర్నూల్, జనవరి 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం  డిండి- ఏదుల ఎత్తిపోతుల పథకంపై రాష్ర్ట ప్రభుత్వ మంత్రివర్గం మరోమారు చర్చించి పునరాలోచన చేయాలని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం నల్గొండ ప్రాంతానికి నీటిని తరలించాలన్న ఉద్దేశంతో ఏదుల డిండి పేరుతో పాలమూరు నీటిని తరలించాలనుకోవడం బాధాకరమని అదే గనక జరిగితే ఈ ప్రాంతం మళ్లీ కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సిందేనని ఆవేదన చెందారు.  ఈ నిర్ణయాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

ఈ ప్రాంత మంత్రి మంత్రి జూపల్లి కష్ణారావు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ దీనిపై ప్రత్యేక దష్టి పెట్టి డిండి ప్రాజెక్టుకు ఇతర ప్రాంతాల నుంచి నీటిని తరలించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయాలన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ రోజు రోజుకు దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా, ఆందోళన కలిగించేలా నోటికొచ్చినట్లు  ప్రకటనలు చేస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యలో రామాలయ ప్రారంభం జరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రసంగించడం దారుణం అన్నారు.

స్వాతంత్రాన్ని అమరుల త్యాగాలను మహానుభావుల త్యాగాలను హేళన చేసే రకంగా మాట్లాడిన దానిపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎండి ఫయాజ్, వెంకటయ్య, కష్ణాజి, నరసింహ, యేసయ్య, చంద్రమౌళి, శివశంకర్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, అంజి, శ్రీను, శంకర్, రవీందర్, తుమ్మల శివుడు, రవికుమార్, కుతుబుద్దీన్, మురళి తదితరులు పాల్గొన్నారు,