సీపీఐ జాతీయ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ సిటీ, జనవరి 4 (విజయక్రాంతి): సివిల్ సప్లు హమాలీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, హమాలీ కార్మికుల కూలీరెట్ల పెంపు మరియు ఇతర సంక్షేమ పథకాల వర్తింపు కోసం తక్షణమే ప్రభుత్వం జీవో విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ర్టవ్యాప్తంగా సివిల్ సప్లు హమాలీ కార్మికులు నాలుగు రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, కూలిరేట్ల పెంపు కోసం చేస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం కరీంనగర్ లో వెంకటరెడ్డి సందర్శించారు.
వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హమాలీ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, ప్రభుత్వం, సివిల్ సప్లు కార్పొరేషన్ లిమిటెడ్ వారు హమాలీకూలీరెట్ల పెంపు, బకాయిల చెల్లింపు కోసం అధికారులు హామీ ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తున్న నేటికీ అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు, కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ సివిల్ సప్లుసై కార్పొరేషన్ హమాలీ యూనియన్ నాయకులు ఎం అంజయ్య, ఏ రాజయ్య, శ్రీధర్ ఏ మల్లయ్య, గొర్రె కనకయ్య, గడ్డి లక్ష్మయ్య, లక్ష్మి, మల్లయ్య,రాజమల్లు హమాలి కార్మికులు పాల్గొన్నారు
కేసీఆర్ రాజ్యంలో గుట్టలు కూడా పట్టాలయ్యాయి
తంగళ్ళపల్లి : కెసిఆర్ రాజ్యంలో గుట్టలు కూడా పట్టాలయ్యాయని, ధరణి పోర్టల్ వైరస్ లాంటిదని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆక్రమణకు గురైన భూముల కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులతో రెవెన్యూ సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిశీలించి మాట్లాడారు.సిరిసిల్లలో సుమారు 6 నుంచి 7 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి ఆవేదన వ్యక్తం చేశారు.