calender_icon.png 25 February, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీ కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి

18-02-2025 12:00:00 AM

సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేశ్

చిట్యాల, ఫిబ్రవరి 17 : చిట్యాల మండలకేంద్రానికి చెందిన  చెందిన ఆరేపల్లి ఎల్లయ్య గత 25 సంవత్సరాలుగా సివిల్ సప్లు హమాలి కార్మికుడిగా పని చేస్తున్నాడు.ఇటీవల  అనారోగ్యంతో మృతి చెందడు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. హమాలి వృత్తినే నమ్ముకుని 25 సంవత్సరాలుగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎల్లయ్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు రామ్ రామచంద్ర మాదిగ, సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు జగన్, రాజశంకర్ పాల్గొన్నారు.