calender_icon.png 15 November, 2024 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీ డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలి

12-11-2024 01:18:25 AM

మాజీ మంత్రి ఈటల రాజేందర్ 

జనగామ, నవంబర్ 11(విజయక్రాంతి): రైతులు కాంటాలు పెట్టిన వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జనగామలోని వ్యవసాయ మార్కెట్‌ను ఈటల సందర్శించి పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగు ఎక్కువ, మిల్లులు తక్కువ కావడంతో సమస్య వస్తోందన్నారు. గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ డబ్బులు కేంద్రమే చెల్లిస్తుండగా.. ఐకేపీ సెంటర్లలో రైతుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పంట మార్కెట్ తెచ్చిన రెండు, మూడు రోజుల్లో కాంటా పెట్టి రైతులకు డబ్బులు చెల్లించాలని.. హమాలీ డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు హరిశ్చంద్రగుప్తా, కేవీఎల్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.