calender_icon.png 25 January, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..

24-01-2025 11:20:18 PM

కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి...

ముషీరాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో మృతి చెందిన అన్నదమ్ములు ధనూష్, లోహిత్‌ల మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో ఇటీవల సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో ప్రమాదవాశాత్తు మృతి చెందిన అన్నదమ్ములు ధనూష్, లోహిత్‌ల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులు నర్సింగరావు, జ్యోతిలను మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి పరమార్శించారు. వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబ విదరాలు, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేద కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

మృతుల తల్లిదండ్రులు కేంద్ర మంత్రితో మాట్లాడుతూ... తమకు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదని, ఉన్న ఇద్దరు కొడుకులు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డితో బోరుమని విలపించారు. సొంత ఇల్లు కూడా లేదని, ఉద్యోగం ఇల్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ మైనారిటీ మోర్చా మహాంకాళీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందడంతో కేంద్రమంత్రి వారి ఇంటికి వెళ్లి పరమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సభ్యుడు నందగిరి నర్సింహా, కార్పొరేటర్ రవిచారి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రమేష్ రాం, డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్, రాష్ట్ర నాయకులు ఆర్. విశ్వం, బిజ్జి కనకేష్ కుమార్, చంద్రమోహన్, కృష్ణ, నత్యనారాయణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.