16-02-2025 12:00:00 AM
ట్రిపుల్‌ఆర్, మెట్రో పనుల్లో వేగం పెంచాలంటున్న ఇన్వెస్టర్లు
పంచాయతీ లేఔట్ల అనుమతులపై పునరాలోచించాలని విజ్ఞప్తి
ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల్లో నమ్మకం కలిగిస్తేనే పెట్టుబడులు
హైదరాబాద్, ఫిబ్రవరి ౧౫ (విజయక్రాం తి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్‌లా తయారైంది. ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ‘ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదా యం రూ.18,500 కోట్లే. ప్రభుత్వ అవసరాలకు ఈ సొమ్ము ఏమాత్రం సరిపోవడం లేదు.
రాష్ట్రాన్ని సక్రమంగా నిర్వహించాల న్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా రూ.30 వేలు కోట్లు అవసరం’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రియల్ రంగం ప్రస్తుతం నెమ్మదించింది. రాష్ట్రానికి ప్రతినెలా వచ్చే రూ.18,500 కోట్లలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు రూ.6,500 కోట్లు పోతుంది.
మరో రూ.6, 500 కోట్లు అప్పులు చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన రూ.5,500 కోట్లలో సంక్షేమ పథకాల అమలుకు వెచ్చిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం ఆశించిన మేరలో రావడం లేదు. హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు రియల్ ఎస్టేటే. కానీ, ఇప్పుడిది కొంత మేర డౌన్ అయ్యిందని, అందులో పెట్టుబడులు పెట్టే రియల్ వ్యాపారులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందు కుంటుందని అంతా అనుకుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. డబ్బులు చేతులు మారితేనే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తోంది.
వీటిపై దృష్టిసారించాలి..
కొనుగోలు శక్తి పెరిగితేనే ఆయా రంగా ల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. మన దగ్గర స్టాక్ మార్కెట్లలో పెట్టుబ డులు పెట్టేవారిని పక్కనబెడితే.. మధ్యతరగతి, ఆ పైస్థాయి ప్రజలు పెట్టుబడులు రియ ల్‌ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడులు పెట్టేందు కు ఆసక్తి చూపుతారు. ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతోంది.
తద్వారా ప్రభుత్వ అవసరాల కోసం వాటిని ఖర్చుపెట్టొచ్చు. ప్రభుత్వ ఖజానా గాడిలో పడాలంటే ప్రధానంగా పలు అంశాలపై సర్కార్ దృష్టి సారించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీల్లో లేఔట్లకు అనుమతు లు ఇవ్వాలి. గతంలో లేఔట్లకు అనుమతు లు ఇచ్చారు కానీ, ప్రస్తుతం నిబంధనలను కొంతకాలంగా రిజిస్ట్రేషన్లు జరగ డం లేదు.
వీటికి అనుమతులు ఇవ్వడం ద్వారా వీటిపైనే ఆధారపడ్డ రియ ల్ వ్యాపారులు, పెట్టుబడిదారులు, అనుబంధరంగాల వారికి మేలు జరగడమే కాకుండా ప్రభుత్వానికి వీటి ద్వారా ఆదా యం సమకూరుతుందనే అభిప్రాయాలను రియల్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు ట్రిపుల్ ఆర్ జంక్షన్లను ఫైనల్ చేసి, ఆ పాయింట్లలో పనులు ప్రారంభించడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ భూమ్ పెరుగు తోంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పనులను త్వరితగతిన చేపట్టడం ద్వారా వ్యాపారులు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు.
రియల్ ఎస్టేట్‌కు ఆక్సిజన్ అందించాల్సిందే..
నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు కనెక్టివి టీ పెరగాలి. ఇందుకు మెట్రో పనులు మొదలుపెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోదశలో భాగంగా మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రోరైలు కారిడార్లను విస్తరించాల ని నిర్ణయించింది. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కి ల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదా పు 23 కిలోమీటర్ల మేర కారిడార్‌ను విస్తరించనున్నారు.
ఇక జేబీఎస్ మెట్రో స్టేషన్ నుం చి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూంకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ను విస్తరించే పనిలో సర్కార్ ఉంది. అయితే ఈ కారిడార్ల లో ఎక్కడెక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు రాబోతున్నాయనే స్పష్టంగా చెప్పడం ద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యాపార సముదాయా ల నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది.
అందులో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తారు. దీనికనుగుణంగానే ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. వీటితోపాటు నిబంధనల మేరకు మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆక్సిజన్ ఇచ్చినట్టవుతోంది. రియల్ రంగం తర్వాత రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్రధాన ఆదాయ వనరు లిక్కరే.
ఈ పాలసీపైన కూడా ప్రభుత్వం కాస్త దృష్టి సారించక తప్పదనే అభిప్రాయాలు వ్యాపారుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రధాన వనరుగదా అని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే విమర్శలు కూడా రాకమానదు. లిక్కర్‌తో ప్రభుత్వాలూ కూలిపోయే ప్రమా దం లేకపోలేదు. అందుకే దీనిపై ఆచితూచీ అడుగులు వేయాల్సి ఉంటుంది.