calender_icon.png 28 December, 2024 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకాంతా చారి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

03-12-2024 04:57:54 PM

విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుల డిమాండ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ప్రాణాలర్పించిన శ్రీకాంత్ చారి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని దడ పుట్టించిన తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు తూమోజు సురేష్ చారి, రాష్ట్ర నాయకుడు శ్రీమంతుల వేణుగోపాల్  మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం అమరుడైన శ్రీకాంత్ చారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ చారి కి గుర్తుగా కాష్య విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బట్టుపెల్లి అశోక్ చారి, శ్రీరామోజు వెంకటయ్య, నల్గొండ తిరుపతి చారి, కస్తూరి రమేష్, తిరుపతి చారి, శ్రీనివాస్ చారి, తూమోజు సాయి, జి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.