calender_icon.png 21 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

20-01-2025 11:07:10 PM

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20న నగరంలో భారీ బహిరంగ సభ ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం విద్యానగర్లోని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు కే. గోవర్ధన్, జెవి. చలపతిరావు, వేములపల్లి వెంకటరామయ్య, పిఓడబ్ల్యు నాయకురాలు జి. ఝాన్సీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులకు ఇస్తామన్న రుణమాఫీ ఇంకా సగానికి సగం మందికి అమలు కాలేదని పేర్కొన్నారు. రైతులకు ఇస్తామన్న రైతుబంధును తగ్గించి ఇస్తామని పేర్కొనడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికిని నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. ధరణి దోషులపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి వాగ్దానం కాగితాలకే పరిమితమైంది అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.