calender_icon.png 17 April, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాల వర్షం వలన నష్టపోయిన మొక్కజొన్న, వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

08-04-2025 10:29:26 PM

తడిసిన ధాన్యంను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి..

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అకాల వర్షం వలన మొక్కజొన్న, వరి పంట నెలపాలైంది అని, వేలాది ఎకరాలలో మొక్కజొన్న, వరి పంటకి నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇల్లందు మండల సహాయ కార్యదర్శి మోతిలాల్, న్యూడెమోక్రసీ కొమరారం ప్రాంతీయ కార్యదర్శి, బోయి తండా మాజీ సర్పంచ్ బానోత్ సంతు, AIKMS మండల నాయకుడు మూడు మాలు, జోగా క్రిష్ణ ప్రభుత్వంని డిమాండ్ చేశారు.

మంగళవారం కొమరారం, పోలారం, పోచారం, మాణిక్యారం, పోలారం పంచాయతీలో మొక్కజొన్న పంటలని బృందం పరిశీలించారు. ఈ సందర్బంగా న్యూడెమోక్రసీ నాయకులు మోతిలాల్, సంతు, మాలు, జోగా క్రిష్ణలు మాట్లాడుతూ... సోమవారం సాయంత్రం అకాల వర్షం, గాలి దుమరానికి వేలాది ఎకరాలలో వరి, మొక్కజొన్న పంట నష్టం జరిగిందని, వ్యవసాయ అధికారులు పంట నష్టంపైన సర్వే చేసి ప్రభుత్వంకి నివేదించాలని, తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, పూర్తిస్తాయిలో రైతు రుణమాఫీ జరగక, రైతుబంధు డబ్బులు నేటికీ చేతికి రాక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేసి సాగు చేసిన రైతుల పరిస్థితి అకాల వర్షం వల్ల రైతు పరిస్థితి దయనియంగా మారిందని, మొక్కజొన్న ఎకరానికి 50,000 రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వంని డిమాండ్ చేసారు. లేకుంటే రైతాంగం తరపున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం AIKMS నాయకులు నర్సయ్య, భద్రయ్య, కాంపాటి శ్రీను, లక్ష్మయ్య, సమ్మయ్య, నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పాపన్న, హచ్చ, చిన్ని, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.