calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

17-04-2025 12:26:47 AM

బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి

కూసుమంచి, ఏప్రిల్ 16:- కూసుమంచి మండల పరిధిలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి కోరారు..బుదవారం కూసుమంచి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..

ధాన్య కొనుగోలు కేంద్రాల్లో  వడ్ల రాశులు ఎక్కడివి అక్కడే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి .. కనీసం టార్పాలిన్  షీట్లు కూడా అందించే చర్యలు తీసుకోకపోవడం వలన రైతుల ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.. ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని, వివిధ కారణాలు చూపుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు..

తక్షణమే ప్రభుత్వం స్పందించి ధన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ సీట్లు , గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని ,వేగంగా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు.. పిట్టల వేణు , ఆడేపు మధు ,నాగేశ్వరావు తదితరులు ఉన్నారు..