21-04-2025 01:20:38 AM
తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జిలుకర రవికుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమా నికి కట్టుబడి ఉండాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జిలుకర రవి కుమార్ విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులకు రావలసిన సంక్షేమ ఫలాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకొని ఆదివారం బేతేలు ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు.
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వలోకానికి విముక్తి కోసం తన రక్తాన్ని చిందించారన్నారు. గుడ్ ఫ్రైడే రోజు తన ప్రాణాన్ని సమర్పించి తిరిగి మూడవ రోజు ఆదివారం పునర్ధానుడై మరణాన్ని జయించారన్నారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్ష లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సులేమాన్, థామస్, జాన్సన్ మహేష్, తిమోతి, విశాల్, ప్రీతి, స్వప్న, శ్యామల పాల్గొన్నారు.