calender_icon.png 12 January, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి పనిచేయాలి ః కలెక్టర్

05-01-2025 12:00:00 AM

నారాయణపేట, జనవరి 4 (విజయ క్రాంతి) : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఉద్యోగులు పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం టీజీవో 2025 నూతన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ బంగ్లాలో ఎస్‌పీ యోగేష్ గౌతమ్‌కు టీ జీవో అధ్యక్షులు ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు మొగులప్ప తదితరులు ఉన్నారు.

రోడ్డు భద్రతా చర్యలు పాటించాలి ః కలెక్టర్

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల ఒకటి నుండి 31 వరకు జరిగే రోడ్డు భద్రత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్. టి. ఓ.మేఘా గాంధీ, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ అండ్ బి డిఈ రాములు, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, డీఎంహెచ్వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, డిపిఆర్‌ఓ రషీద్, డిఈఓ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌పీ

నూతన సంవత్సరం 2025 సందర్భంగా శనివారం  జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ , డీఎస్పీ ఎన్ లింగయ్య లు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా పోలీసు శాఖ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి జిల్లాలో పోలీస్ శాఖ  పనితీరు బాగుందని, అదే ఉత్సాహంతో  మున్ముందు మరింత బాగా పనిచేసి జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ అభివృద్ధికి తోడ్పడాలని  ఆమె సూచించారు.