calender_icon.png 24 November, 2024 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదండరాం కృషితో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

24-11-2024 09:01:55 PM

టీవీజేఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం కృషితోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని విద్యార్థుల కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచడం సాధారణ అంశం కాదని, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచాలన్న డిమాండ్  లేకున్నా,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా లేకున్నప్పటికి శాసనమండలి సభ్యులు ప్రో కోదండరాం, విద్య శాఖాధికారుల సిఫారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్చ లేకుండా దాదాపు 40 శాతానికి పైగా పెంపుదల చేయడం అభినందనీయమన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ గురించి సీఎం లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం,అన్ని వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం తీసుకున్న ఒక ముందు చూపు నిర్ణయం అని ఆయన ప్రశంసించారు. 7 లక్షల మంది పేద దళిత, గిరిజన, ఆదివాసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ నిర్ణయం వరం అన్నారు.

అన్ని రకాల వస్తువుల ధరలు అడ్డగోలుగా పెరిగినప్పటికి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే మెస్ చార్జీలు కాస్మొటిక్ వంటి అంశంలో మాత్రం గత సర్కారు దయచూపలేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్యా రంగానికి చేసే వ్యయం ఒక ఖర్చులాగా కాకుండా భావితరాల నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించడం గొప్ప పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా డైట్ చార్జీలు, 16 ఏళ్లుగా కాస్మొటిక్ చార్జీలు పెంచకుండా గత ప్రభుత్వాలు పేద విద్యార్థుల పట్ల చిన్న చూపు చూసిందని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తు ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు చేపట్టి,కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేశారని,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న పదోన్నతులను అమలు చేయడంతో పాటు  ఉపాద్యాయుల నియామకాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కోదండరాం కృషితోనే రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి దిశలో పయనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.