calender_icon.png 24 October, 2024 | 4:53 AM

బలహీనవర్గాల వికాసమే ప్రభుత్వ లక్ష్యం

24-10-2024 12:24:53 AM

పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాంతి): బడుగు, బలహీనవర్గాల ఆర్థిక, సామాజిక వికాసమే లక్ష్యంగా తమ ప్రభు త్వం పనిచేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే సర్కార్ పనిచేస్తోందని, వారికోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టి, అమలు చేస్తున్నట్లు చెప్పారు.

బుధవారం సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సార థి రూపొందించిన 80 పాటల సంకలనం ‘ప్రగతిపథంలో ప్రజాపాలన’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గృహలక్ష్మి, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయన్నారు.

తెలంగాణలో గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందన్నారు. ప్రజల భాషలో జానపద శైలిలో పాటల రూపంలో రూపొందిస్తూ ప్రజలందరికీ మంచి జీవన విధానం, అలవాట్ల పట్ల అవగాహనను కలిగిస్తూ, చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాషా, సాంస్కృతిక శాఖ సంచాల కులు డాక్టర్ మామిడి హరికృష్ణ, సాంస్కృతిక సారథి కళాకారులు యశ్‌పాల్, జలజ, దేవత సుధాకర్, విజయ్ కుమార్ తదిత రులు పాల్గొన్నారు.