11-04-2025 04:38:16 PM
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా శుక్రవారం దోమకొండ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ కి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 50 పడకల ఆసుపత్రిగా మారుస్తూ 22 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామిలు తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ హయాంలో ప్రాథమిక ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కు అనుసంధానం చేసి 30 పడకల ఆసుపత్రిగా ఉన్న ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా కావడానికి కృషిచేసిన ఘనత షబ్బీర్ అలికి దక్కుతుందని కొనియాడారు.
శాశ్వతమైన పనులు చేయడంలో షబ్బీర్ అలీ ముందు వరుసలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి పాత తాలూకా కేంద్రంలోని దోమకొండ ఆసుపత్రికి నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, జిల్లా నాయకులు రామస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, సాయిలు, నాయకులు నల్లపు శ్రీనివాస్, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, కలీం, షమీ, కొండ అంజయ్య, సిద్ధారెడ్డి, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, వినీత్, నరేష్ నర్సింలు, మరి శేఖర్ సత్యనారాయణ రామచంద్ర రెడ్డి, బాలరాజు, నగరపు నర్సింహులు, ఎల్లం, రాజేశ్వర్, బాపురెడ్డి, ముత్త గౌడ, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.