22-03-2025 04:54:24 PM
రూ. 18 లక్షలతో నిజాంపూర్ గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం...
సదాశివపేట: గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి తెలిపారు. శనివారం సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో రూ. 18 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. సంగారెడ్డి మాజీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగన్న, నర్సింలు, మాజీ ఎంపీటీసీలు మగ్దూమ్ పటేల్, ఒగ్గు శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు నిజాంపూర్ గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.