calender_icon.png 23 December, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వమే మొదటి ముద్దాయి

23-12-2024 02:21:35 AM

సీపీఐ  నారాయణ

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి దొంగ వ్యాపారాన్ని గౌరవం గా చూపించే పుష్ప సినిమాకు రాయితీలు ప్రకటించి ప్రజలపై భారం మో పడానికి నిర్ణయించిన తెలంగాణ ప్ర భుత్వమే మొదటి ముద్దాయి అని సీ పీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. సందేశమాత్మక చిత్రానికి రాయితీలు ఇవ్వవచ్చని, కానీ, సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగలెత్తే ఇలాంటి రాయితీలు ఎందుకని ప్రశ్నించారు.

పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి చూడగలరా? అని మండిపడ్డారు. ఒక తల్లి ప్రాణాలను లెక్కచేయకుండా తన కొడుకును కాపాడుకోడానికి బలైపో తే, ఆమె సినిమా చూడటానికి టికెట్లు కొనుక్కొని వచ్చిందే తప్ప హీరోను చూడటానికి రాలేదనడం దారుణమన్నారు. ఇలాంటి చౌకబారు ప్రచారాని కి సినిమా వాళ్లు పాల్పడేచ్చేమో గానీ రాజకీయ నాయకులెందుకు కక్కుర్తి పడుతున్నారని దుయ్యబట్టారు.