* ఏండ్లుగా పెండింగ్‌లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
* వారంలో బకాయిలు చెల్లించకుంటే సచివాలయం ముట్టడిస్తాం
* బీసీ విద్యార్థుల సమర శంఖారావం సభలో అఖిలపక్ష నేతల హెచ్చరిక
ముషీరాబాద్, జనవరి 30: విద్యార్థుల బలిదానంతో వచ్చిన రాష్ట్రంలో ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఉసురుపోసుకుంటుందని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు ఆరోపించాయి. తక్షణమే బకాయిల ను విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు.
గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో బీసీ విద్యార్థుల సమర శంఖారావం మహాసభ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని జాతీయ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ సమన్వయం చేయగా ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధు సూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సీపీ ఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈట ల మాట్లాడుతూ ఫీజుల రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వ దయాదాక్షణాల మీద కాకుండా విద్యార్థుల హక్కుగా చూడాలన్నారు. విద్యార్థుల ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ రూ.4,600 కోట్లు విడుదల చేయకుం డా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యా ర్థుల సమస్యల పరిష్కారించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం, కురుమ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి పాల్గొన్నారు.