calender_icon.png 21 March, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా రంగానికి ప్రభుత్వం మొండి చెయ్యి

20-03-2025 12:23:31 AM

మెదక్/ రామాయంపేట, మార్చి 19ఃరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే 0.20 శాతం  కేటాయింపులు తగ్గాయని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం ఇచ్చిన హామీకి బడ్జెట్లో కేటాయించిన దానికి పొంతనలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్.మల్లారెడ్డి వేర్వేరు ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత బడ్జెట్లోకేవలం విద్యకు కేటాయించింది రూ.23,108 కోట్లు అని (7.57%).గత సంవత్సరం రూ.274058 కోట్ల బడ్జెట్ లో విద్యకు కేటాయించింది రూ. 21,292 కోట్లు(7.77%)అంకెల్లో రూ.1816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గిందన్నారు. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను గాలి కొదిలేసి, రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతుందన్నారు.  

 నవాత్ సురేష్ ,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి