calender_icon.png 22 January, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజైన్ల బాధ్యత సర్కారుదే!

22-01-2025 02:13:50 AM

  1. కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు వెల్లడి
  2. పరిశ్రమలకు నీళ్లమ్మి అప్పులు చెల్లించాలనుకున్నాం
  3. స్పెషల్ సీఎస్‌కు 24 ప్రశ్నలను సంధించిన కమిషన్
  4. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణ కంపెనీల ప్రతినిధుల విచారణ

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణకు మంగళవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్యాకేజీలకు సంబంధించిన డిజైన్లు, కాళేశ్వరం పేరిట ఏర్పాటుచే సిన ప్రత్యేక కార్పొరేషన్ పేరిట తీసుకున్న అప్పులు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్, రికార్డులు తదితర అంశాలపై కమిషన్ 24 ప్రశ్నలను సంధించింది.

కార్పొరేషన్‌కు నిధులు ఏ విధం గా సమకూరాయి.. ఆదాయం ఎలా రాబట్టాలని ప్రణాళికలు వేసుకున్నారు.. అప్పుల చెల్లింపునకు ఎలాంటి ప్రాతిపదికన సిద్ధమయ్యారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీతోనే రుణాలు వచ్చాయని రామకృష్ణారావు సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం పరిశ్రమలకు నీటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని గత ప్రభుత్వం ప్రణాళిక రచించినట్లు స్పెషల్ సీఎస్ తెలిపారు.

నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదన్న కమిషన్...  నిబం ధనలు పాటించని అంశాల రికార్డులను రామకృష్ణారావుకు చూపించి ప్రశ్నించింది. ఆర్థిక పరమైన రికార్డులను మెంటేయిన్ చేయలేద ని... ప్రాజెక్టుపై కోర్ కమిటీ రికార్డులు లేవని రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా... డిజైన్లకు ఎవరి బాధ్యత వహించాలన్న ప్రశ్నకు అంతా గత  ప్రభుత్వానిదేనంటూ రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు.

ప్రాజెక్టును త్వర గా కట్టినట్లుగా చెప్పుకున్నా... అసలు నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ సరైన విధంగా క్యాబినెట్ ముందుకు రాలేదంటూ నిబంధనలు పాటించని అంశాల రికార్డులను ఈ సందర్బంగా కమిషన్ రామకృష్ణారావుకు చూపించింది. తీసుకున్న అప్పునకు ఏటా ఎంత చెల్లింపులు చేస్తున్నారన్న ప్రశ్నకు అసలుతో కలిపి రూ. 7300 కోట్లు చెల్లిస్తున్నట్లు స్పెషల్ సీఎస్ సమాధానమిచ్చారు.

9నుంచి 10.5 శాతం వడ్డీతో చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరుసగా మూడు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారణకు పిలిచింది. మంగళవారం విచారణకు అన్నారం బ్యారేజీ  నిర్మించిన నవయుగ కంపెనీ ముగ్గురు ప్రతినిధులు, బుధవారం విచారణకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ఎల్‌అండ్ కంపెనీ ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఎల్లుండి సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన ఆఫ్కాన్స్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లోగా అధికారులు, కంపెనీల ప్రతినిధులతో పాటు గతంలో విచారించిన పలువురు అధికారులను తిరిగి విచారించాలని కమిషన్ భావిస్తోంది. సాధ్యమైంత త్వరగా నివేదిక రూపొందించేందుకు కమిషన్ విచారణ నిరాటంకంగా చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.