calender_icon.png 21 March, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన చేతకాదు!

21-03-2025 01:17:24 AM

  1. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
  2. ప్రజలను మోసం చేస్తున్న బడాభాయ్, చోటాభాయ్
  3. 27న వరంగల్ సభకు ప్రతీ పల్లె నుంచి తరలిరావాలి
  4. సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

సూర్యాపేట, మార్చి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు కాలం తెచ్చినది కాదని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు..

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులు ఏనాడూ ఇంతటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొనలేదని, ప్రతీ పంటకు అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించామని గుర్తుచేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. మళ్లీ ఢిల్లీ పాలకుల పాలైందని అన్నారు.

ఇప్పటికీ 40 సార్లు హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వందల కోట్ల రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి డబ్బు మూటలను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతు రుణమాఫీ చేయాల్సి ఉన్నది.

రూ.49,500 కోట్లని చెప్పిన ముఖ్యమంత్రి, రెండు రోజుల తర్వాత రూ.40వేల కోట్లని చెప్పారన్నారు. ఇప్పుడేమో రూ.20 వేల కోట్లేనని అసెంబ్లీలో చెప్పుకుంటున్నారని, తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి రైతులు తమకు రుణమాఫీ కాలేదని గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. 

పర్సంటేజీలపైనే రేవంత్ దృష్టి..

కేసీఆర్ పాలనలో చూసిన అభివృద్ధి నేడు మాయమైందని, ప్రతీ గ్రామానికి మంచినీళ్లు ఇచ్చామని, రవాణా మార్గాలను మెరుగుపరిచామని కేటీఆర్ గుర్తుచేశారు. చిన్నవయసులో సీఎం అయిన రేవంత్‌రెడ్డి తన తీరు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునిస్తాడని అనుకుంటే..

పర్సనాలిటీమీద కాకుండా ప ర్సంటేజీలపైనే తన దృష్టినంతా కేంద్రీకరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పా లన చేతకాదని విమర్శించారు. భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చోటులేకుండా పోయిందన్నారు. 

వరంగల్ సభకు తరలిరావాలి..

సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండకు గొప్ప చరిత్ర ఉందని నిజాం పాలకులను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన చరిత్ర ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 27న గులాబీ జెండా పార్టీ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ సభకు ప్రతీ గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం లో బడాభాయ్, రాష్ట్రంలో చోటాభాయ్ కలిసి ప్రజలను మో సం చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ఆ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలని కోరారు. తెలం గాణలో శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్ అని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీనే అని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికే పదవులు వస్తాయని, వారందరికీ శిరస్సువంచి వందనం చేస్తున్నానని తెలిపారు.

ఎన్నో ఉద్యమాలు చేశాం

కేసీఆర్ అంటేనే బీఆర్‌ఎస్ అని.. బీఆర్‌ఎస్ అంటేనే కేసీఆర్ అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి చెప్పారు. 2001లో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను ఇక్కడే ప్రకటించి అనేక ఉద్యమాలు చేసిందని, స్వ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండను ఫ్లోరోసిస్ నుంచి కాపాడుకున్నామన్నారు. సూర్యాపేట జిల్లాగా మార్చుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు.

మెడికల్ కళాశాల, మినీ ట్యాంక్‌బండ్, విశాలమైన రోడ్లు, దామరచర్ల విద్యుత్ ఫ్లాంట్.. ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్ల య్య యాదవ్, గాదరి కిషోర్‌కుమార్, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.