25-03-2025 01:20:16 AM
బీఆర్‌ఎస్ నేత -దొడ్డి తాతారావు
చర్ల, మార్చి 24 (విజయ క్రాంతి) : విలేకర్లకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బిఆర్ ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ ఐనవోలు పవన్ డిమాండ్ చేశారు. సోమవారం బిఆర్ యస్ పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశంలో కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొత్తగూడెంలో విలేకరులు నిరాహార దీక్షలు చేస్తున్నారు
వారికి చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తు ప్రజలను చైతన్య చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేస్తూ ఎటువంటి జీతం లేకుండా ప్రాణాలకు తెగించి రాజకీయ నాయకులను ఎదిరిస్తు సేవలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని , అక్రిడేషన్ కార్డ్ విషయంలో కాలయాపన చేయకుండా నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
ఈ సమా వేశంలో సీనియర్ నాయకులు sd అజీజ్, గోరంట్ల వెంకటేశ్వరావు, కాకి అనిల్, పంజా రాజు, తడికల బుల్లేబ్బాయి, అంబోజి సతీష్, సృజన కుమార్, కుక్కడపు సాయి, కిషోర్ కుమార్ పాల్గొన్నారు.