ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయని, అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆటో యూనియన్ నేతలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని తెలం గాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూ నియన్ జేఏసీ నేతలు కలిశారు.
ఏడాదిగా తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు కారణంగా తమ జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. తమకు ఏడాదికి రూ. 12వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ప్రభు త్వం నేటికీ స్పందించడం లేదని మంత్రి దృష్టికి తీసుకుపోయారు. త్వరలోనే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించి, అక్కున చేర్చుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. ఆటో కార్మికులు పార్టీల ఉచ్చులో పడి సమ్మెలు చేయడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడతాయని మంత్రి తెలిపారు.