calender_icon.png 26 November, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

26-11-2024 04:36:47 PM

రోడ్ల నిర్మాణానికి రూ.20.86 కోట్ల నిధులు మంజూరు 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు (విజయక్రాంతి): నియోజకవర్గలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.  ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సి ఆర్ ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి రూ.20.86 కోట్లు  మంజూరు అయ్యాయని తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుండి బానూరు గ్రామం వరకు కోటి రూపాయలు అంచనాతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎల్ఏ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం నందిగామ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.50 వేలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, గోపాల్, శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో యాదగిరి, పంచాయతీరాజ్ విభాగం డీఈ సురేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.