- శేరిగూడలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు
- బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా రైతులను వంచించిందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంక టరమణ, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని శేరిగూడ, మల్‌శెట్టిగూడ గ్రామాల్లో పర్యటించి.. వ్యవసాయ కళ్లాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరి కోతలు మొదలై ఇరవై రోజులు దాటినా కల్లాలవద్దే పడిగాపులు కాసున్నామని ధాన్యం కొనుగోలు చేసేనాథుడు లేడని రైతులు వాపోయారు. ఈ విషయమై కిషన్‌రెడ్డి వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపీకృష్ణకు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి లో కొనుగోలు చేస్తామని మేనేజర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, రైతుబంధు అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ క్యామ శంకర్, మున్సిపల్ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పొట్టి శ్రీకాంత్, మాజీ సర్పంచ్‌లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.