మహబూబ్ నగర్, జనవరి 13 (విజయ క్రాంతి) : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గతో పాటు పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యంగా ఉండి ముందుకు సాగుదామని, ఆలయాల అభివద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడు సహకరిస్తుందని తెలిపారు. అనంతరం గౌడ ఉద్యోగుల, విశ్శాంత ఉద్యోగుల అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రకుమార్, సాయిల్ గౌడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.