calender_icon.png 17 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

17-01-2025 01:43:41 AM

వనపర్తి, జనవరి 16 ( విజయక్రాంతి ) :  క్రీడల అభివద్ధి కోసం తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఈ క్రమంలో నూతన స్టేడియాలను నిర్మిస్తూ  క్రీడకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో గత 5రోజులుగా  నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీల విజేతలకు ఆయన గురువారం బహుమతులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని క్రీడలతో దేహదారుడ్యాం లభించడమే గాక అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందవచ్చునన్నారు. గ్రామంలో గత 5 రోజులుగా క్రీడలను నిర్వహించిన నిర్వాహ కులు రాజశేఖర్ ఉదయ్ సతీష్ ధర్మేందర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో  వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకష్ణారెడ్డి,  పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన

వీవర్స్ కాలనీలో అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే మేఘా రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుధ్య లోపానికి ప్రధాన కారణమయ్యే  డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు వెల్దురు గ్రామ వీవర్స్ కాలనీలో జిల్లా పరిషత్ నిధులనుంచి 7లక్షలు ఖర్చు చేసి అండర్ డ్రైనేజి నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. 

స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన 

వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో గురువారం స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సెంటర్ ద్వారా గ్రామం లోని యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  సాయి చరణ్ రెడ్డి , మురళీధర్ రెడ్డి,  మండల అధ్యక్షులు విజయ్ కుమార్, వెంకట్రావు , రాములు నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, కష్ణయ్య, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, రవీందర్ రెడ్డి, బాలరాజు యాదవ్ , భధ్యా నాయక్ తదితర గ్రామస్ పాల్గొన్నారు.