20-03-2025 02:11:12 AM
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి19 (విజయక్రాంతి): అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లు, రాజీవ్ యువశక్తి బిల్లులను ఆమోదం తెలుపడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు నివాసం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆత్రం సక్కు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు కులగనన నిర్వహించడంతోపాటు ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్ ప్రత్యేక బిల్లు ను అధికారికంగా అసెంబ్లీలో ఆమోదం పలకడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసాడే చరణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, నాయకులు రూప్ నార్ రమేష్, శివ ప్రసాద్, కలీం, మారుతి పటేల్, సాయి పాల్గొన్నారు.