calender_icon.png 1 April, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి 1 నుంచి సన్న బియ్యం!

31-03-2025 01:43:57 AM

పేదోడి కడుపు నింపనున్న రాష్ట్ర ప్రభుత్వం 

గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 

ఎమ్మెల్యే మురళి నాయక్ 

 మహబూబాబాద్ మార్చి 28: (విజయ క్రాంతి) ఎన్నో రోజులుగా పేద ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకం ఉగాది పండుగ రోజు అందించనుంది గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందించి పేదోడి కడుపు నింపుతామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం అందించనుంది కాగా రేషన్ కార్డులోని ఒక్కొక్క సభ్యునికి ఇప్పటికే ఆరు కిలోల చొప్పున దొడ్డు బియ్యం అందించడం జరుగుతుంది. అయితే గతంలో సైతం బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో సన్న బియ్యం కొన్ని నెలలు ఇచ్చినప్పటికీ దొడ్డు బియ్యాన్ని సన్నబియంగా మార్చి ఇచ్చారనే అపోహ ప్రజల్లో బలంగా ఉంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా  సన్న వడ్లను రైతులు పండించాలి అని పిలుపుతో 500 రూపాయల బోనస్ సైతం ఇస్తామని హామీ ఇచ్చి పండించింది అయితే ఇప్పుడు అదే బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు పంచనుంది.

గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది 

తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలు కచ్చితంగా అమలు చేస్తుందని ఇప్పటికే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం గృహ జ్యోతి కింద 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా లాంటి పథకాలను అమలు చేసి చూపిందని ఇప్పుడు తాజాగా పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాదితో ప్రారంభించనుందని ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలు కడుపునిండా అన్నం తింటారని అన్నారు గత ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని గత ప్రభుత్వం ఒకటి రెండు నెలలు సన్నబియ్యం ఇచ్చినప్పటికీ మిల్లుల ద్వారా దొడ్డిబియాన్నే సన్న బియ్యం గా మార్చి అందులో ఎలాంటి పోషకాలు లేకుండా పేద ప్రజలకు ఇచ్చారని  హాస్టల్లో సైతం అదే బియ్యాన్ని సరఫరా చేయడం అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై బోనస్ ప్రకటిస్తూ వారి చేత సన్నబడ్లను పండించి అదే బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని అది తెలుగు ప్రజలకు నూతన సంవత్సరంగా పిలిచే ఉగాది రోజున ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నారు.

గిరిజనుల చిరకాల ఆశ నెరవేరుతుంది 

ఆదివాసి గిరిజన ప్రజల చిరకాల కోరిక ఈఉగాదికి తీరబోతుందని ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వాయిస్ ఛైర్మెన్ భూక్య పద్మ హర్షం వ్యక్తం చేశారు ఈనెల 31వ తేదీ ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనుండగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు కడుపునిండా అన్నం తినాలంటే దొడ్డు బియ్యం ద్వారా ఎంతో ఇబ్బంది పడేవారని డబ్బుండి ధనవంతులైన వారే సన్నబియ్యం తింటున్నారని తమ ప్రేజా ప్రజలకు సన్నబియ్యం మోక్షం రాదా అని బాధపడేవారని అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 500 బోనస్ ఇచ్చి సన్న వడ్లను పండించి నేడు అదే సన్నబియాన్ని రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రాంతమని తాండాలలో మా గిరిజన మహిళలు ఎన్నో రోజులుగా సన్నబియ్యం కోసం ఎదురు చూశారని అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సాధ్యపడిందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో సన్నబియ్యం ఇస్తానని చెప్పి మోసం చేశారని ఎన్నికలు ఉన్నచోట దొడ్డు బియ్యాన్ని మిల్లుల ద్వారా మళ్లీ పట్టించి దానిని ఒకటి రెండు నెలలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు తాజాగా పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం ద్వారా మరింత ఉత్సాహంగా ప్రభుత్వాన్ని బలపరుస్తారని అన్నారు

- ఆదివాసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ భూక్య పద్మ 

ఏర్పాట్లు పూర్తయ్యాయి

ఉగాదికి సన్నబియ్యం ఇవ్వడంపై అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సివిల్ సప్లై జిల్లా అధికారి ప్రేమ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకం జిల్లాలోని అన్ని మండలాల్లో ఏప్రిల్ నెల నుండి అందించడం జరుగుతుందని ఈ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సివిల్ సప్లై జిల్లా అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు జిల్లావ్యాప్తంగా 4503 రేషన్ షాపుల్లో 16,794 కార్డులు 224 ఎస్‌ఎస్సి02 కార్డులో గాను మొత్తం 7 3,530 యూనిట్ లను ప్రతినెల 4 లక్షల 50 యొక్క వేళ 624 మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈ క్రమంలో ఈ ఏప్రిల్ 31వ తేదీ మొత్తం సన్నబియన్ రేషన్ షాప్ ల ద్వారా లాంచనంగా ప్రభుత్వం ప్రారంభించగానే జిల్లా రేషన్ షాప్ వినియోగదారులకు పంపిణీ జరిగిన జరుగుతుందని పంపిన విషయమే జిల్లాలోని సంబంధిత రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సక్రమంగా ఇలాంటి అవినీతికి తావు లేకుండా సామాన్యులకు వరంగా సన్నబియ్యం కోసం ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే విధంగా సూచనలు చేశామని అన్నారు.

- సివిల్ సప్లై జిల్లా అధికారి ప్రేమ్ కుమార్