calender_icon.png 10 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం

10-01-2025 12:28:29 AM

కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమిలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బాన్సువాడలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోచి గణేష్, ఎర్రవటి సాయిబాబా, రమేష్, యాదవ్, గౌస్, మహేష్, దత్తు పాల్గొన్నారు.