calender_icon.png 14 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

14-02-2025 01:21:23 AM

  • ఉపాద్యాయ ఎమ్మెల్సీ ప్రభారి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, 
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి

కామారెడ్డి, (విజయక్రాంతి): పట్ట భద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో భాగంగా గురువారం బీజేపీ జిల్లా కార్యాల యంలో కామారెడ్డి అసెంబ్లీ కి సంబంధిం చిన ఓటరు ఇంచార్జీల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉపాద్యాయ ఎమ్మెల్సీ ప్రభారీ ఎన్ వి ఎస్ ఎస్  ప్రభాకర్ మాట్లాడుతూ. ఉపాధ్యా యులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదనీ అన్నారు. 

వారి డిమాండ్లు నెరవేరాలని అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే  బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొమురయ్య కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనీ ప్రతి ఓటరును కలిసి విజ్ఞప్తి చేయాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జిల్లా ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ  ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలిసి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని కోరా లనీ అన్నారు.

గ్రామ గ్రామాన నిరుద్యో గులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి వేచి చూస్తున్నారనీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించే విధంగా బిజెపి శ్రేణులు ప్రతి ఒక్క ఓటరు కలిసి ఎమ్మెల్సీల విజయ దిశగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు  శ్రీకాంత్, భరత్, నరేందర్, వేణు, బాల్ రాజు, సురేష్, అనిల్, భూపాల్, ప్రవీణ్, రమేష్, సంపత్ , ఓటరు ఇంచార్జీలు పాల్గొన్నారు.