సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శృతిక...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యా వ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక అన్నారు. ఉద్యోగ భద్రత కోసం ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మెలో భాగంగా ఆదివారం ఒంటి కాలుపై నిల్చుండి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శృతిగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల రెగ్యులర్ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 13 రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేజీబీవీ, యుఆర్ఎస్, సి ఆర్ టి పోస్టులను తాత్కాలిక పద్ధతిన నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారం, కోశాధికారి నగేష్, మీడియా ప్రతినిధి సంతోష్ నాయకులు సందీప్, అన్నపూర్ణ, చైతన్య, ప్రశాంత్, రాజేష్, కవిత, అనుప్, రాజేష్, వెంకటేష్, స్వప్న, సత్యనారాయణ, తిరుపతి, మహేష్, ప్రసన్న, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.