calender_icon.png 17 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం

01-09-2024 01:50:05 AM

  1. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి 
  2. పాలమాకుల కేజీబీవీ సందర్శన 
  3. విద్యార్థులతో మాట్లాడి భరోసా ఇచ్చిన నేతలు 

రాజేంద్రనగర్, ఆగస్టు31: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం, వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత టీ.హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కేజీబీవీ విద్యార్థినులు.. తమకు పురుగుల అన్నం పెడుతు న్నారని ప్రశ్నిస్తే.. హాస్టల్ అధికారులు వేధిస్తున్నారని, కొడుతున్నారని శుక్రవారం బెంగ ళూరు హైవేపై ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి హరీష్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి తదితరులతో కలిసి కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో మాటాడారు.

వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్‌లో పరిశుభ్రతను పరిశీలించారు. అన్నం, సాంబారు, ఇతర కూరలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు నాసిరకం భోజనం పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నింపారని, ప్రస్తుతం విద్యార్థులకు గొడ్డుకారంతో భోజనం పెడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గతంలో రోజూ కోడిగుడ్డు పెట్టామని, ప్రస్తుతం వారానికొకసారి రెండుగుడ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బోరున విలపించిన విద్యార్థినులు..

విద్యార్థులను పరామర్శించిన సబితారెడ్డి ఎదుట విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ల దృష్టికి తీసుకెళ్తే వాటిని తీసేసి అలాగే తినాలని చెబుతున్నారని భోరున విలపించారు. వారానికొకసారి మటన్ పెట్టాల్సి ఉన్నా అది అసలే పెట్టడం లేదని, వారానికొకసారి చికెన్ మాత్రమే పెడుతున్నారని ఆరోపించారు. తమకు నీళ్ల చారు పెడుతున్నారని.. అది తినలేమని చెబితే తింటే తినండి లేదంటే చావండి అని దూషిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఇక్కడ జరుగుతున్న విషయాలను తల్లిదండ్రులక చెబితే టీసీలు ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థినులు విలపించారు.

బాత్‌రూమ్‌లు తమతోనే కడిగిస్తున్నారని, అన్నీపనులు కూడా తమతోనే చేయిస్తు న్నారని వాపోయారు. జ్వరం వచ్చిందని చెబితే కావాలని డ్రామాలు ఆడుతు న్నారని నర్సు మమ్మల్సి తిడుతోందన్నారు. అంద రూ వచ్చి మమ్మల్ని పరామర్శిస్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదని చెప్పారు. మీరు వెళ్లాక తమను కొడతారని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫోన్ నంబర్ ఇచ్చాం కదా.. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా వెంటనే కాల్ చేస్తే తాము వస్తామని సబితా రెడ్డి విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. 

విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు

విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్ నాయక్ మండిపడ్డారు. సర్కారు ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దారుణమని, ఇది సిగ్గు చేటన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం..

పాల్మాకుల కేజీబీలో సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నా రు. విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వారంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.