calender_icon.png 26 December, 2024 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

02-12-2024 10:35:25 PM

ప్రభుత్వ గిరిజన, మోడల్ పాఠశాల సందర్శన 

వనపర్తి విజయక్రాంతి): గిరిజన, మోడల్, వసతి గృహలలో ఉన్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని బిఆర్ఎస్వి గురుకుల బాట ఇంఛార్జి శివ ప్రసాద్ యాదవ్, బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా ఘణపూర్, మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన పాఠశాలలు, మోడల్ పాఠశాల, వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత తొమ్మిది నెలల నుండి అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులను బిఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంతో ముందుకు వెళ్లిన బృందానికి విద్యార్థులు తమ కన్నీటి భాధలను చెప్పుకున్నారన్నారు.

పాఠశాల రావాలంటే సకాలంలో బస్సు లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని పలుమార్లు ఆర్టీసీ డియంకి అనేక సార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించిన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ వెంకటేష్ వాణి దేవి, రాళ్ళ కృష్ణయ్య, అమరేందర్, లక్ష్మణ్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, లక్ష్మీకాంత్ పెబ్బేరు పట్టణం అధ్యక్షులు, అఖిలేందర్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.