calender_icon.png 10 April, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలం

03-04-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్.శ్రీనివాసరావు

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల స్థలాన్ని అమ్మే నిర్ణయాన్ని విరమించుకోవాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఈ మేరకు బుధవారం గాంధీనగ ర్లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో ఆయ న మాట్లాడుతూ న గరంలో విదేశీ మ హిళపై అత్యాచారం జరగడం పూర్తిగా హోంశాఖ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో మహిళపై అత్యాచారం జరగడం  దారుణమన్నారు. ఆచరణలో సాధ్యంకాని వాగ్దానాలు చేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పటికీ ప్రజల దృష్టి మరల్చేందుకు  ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.