21-03-2025 12:14:01 AM
జహీరాబాద్, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వివిధ రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం ఒక ప్రక టనలో తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో సరిపడ నిధులు కేటాయించలేదు అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముం దు ప్రకటించి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు., మహాలక్ష్మి పథకం, విద్యా, ఆరోగ్య ప థకాలకు సరైన నిధులు కేటాయించలేదు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ గా ఉందన్నారు.