calender_icon.png 12 December, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీల అమలులో ప్రభుతం విఫలం

12-12-2024 12:57:43 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాం తి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభు తం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో బుధవారం 73 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుతం పేదలకు అందించే పథకాలలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారుల కు సూచించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.