22-04-2025 01:13:59 AM
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
మునిపల్లి, ఏప్రిల్ 21 : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. వరంగల్ జిల్లాలో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు సంబంధించి సోమ వారం నాడు మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామ శివారులో గల శ్రీ సాయి గార్డెన్ లో వాల్ పోస్టర్ ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంటి క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకు పింఛన్లు, రైతులకు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఆడ ప్రజలకు 2500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు పూర్తి గా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఈనెల 27న జరిగే సభకు ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలని కార్యకర్తలకు పిలు పునిచ్చారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, పైతర సాయికుమార్, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శశి కుమార్, మాజీ ఎంపిటిసిలు వెంకటేశం, శివకుమార్, మాజీ సర్పంచులు రమేష్,
విట్టల్, శంకర్, శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచులు సంగ మేశ్వర్, దత్తు గౌడ్, రమేష్, నాయకులు రామచంద్ర రావు పంతులు, ఖుతుబోద్దిన్, మౌలానా, డాక్టర్ సుల్తాన్, తుడుం సుభాష్, తుడుం దుర్గయ్య, సిరాజ్, మొగులయ్య, నాగన్న, శేఖర్, భాగన్న, పవన్ రెడ్డి, భాస్కర్, మల్లేశం, పాండు, హఫీస్, ఆనంద్, నవీన్, నర్సింలు పాల్గొన్నారు.