03-04-2025 06:04:46 PM
సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి..
చేగుంట: పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి అన్నారు. మండల పరిధిలో కోనాపూర్ గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇండ్లను, ఇండ్ల స్థలాలను అందజేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఒక్కంటికి 35 కిలోలు చొప్పున, అన్నపూర్ణ కార్డు ఒక్కంటికి 10 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో డీలర్ రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంచమి వినోద్, గ్రామ అధ్యక్షుడు పంచమి కుమార్, మాజీ వార్డు సభ్యులు తిప్పగౌని బాబుగౌడ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు రామస్వామి, రాంబాబు, మిద్దె బాబు, శ్రీకాంత్, దుర్గ ప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.