calender_icon.png 19 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

11-04-2025 04:33:16 PM

సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్..

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల మార్కెట్ కమిటీ యార్డ్ లో శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ రైతులకు తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటాలు రూ. 3371/- తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్, మీర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్, ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్. నీలావర్ శివరాజ్ పటేల్.హన్మాండ్లు స్వామి, మాజీ ప్రజ్ఞ కుమార్, సోసైటీ సెక్రటరీ బాబు రావు పటేల్, రైతులు నాయకులు రైతులు ఉన్నారు.